DISTRICTS

LRS పథకంపై ACPల పని తీరుపై ఆసహనం వ్యక్తం చేసిన కమీషనర్

నెల్లూరు: LRS పథకంపై సంబంధిత ACPలు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించలేదని కమిషనర్ అసహనం వ్యక్తం చేస్తూ,, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులు LRS పథకం అమలు పై దృష్టి సారించి 100% లే ఓట్ల క్రమబద్ధీకరణ జరిగేలా కృషి చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ సూచించారు. ఆదివారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో పట్టణ ప్రణాళిక విభాగంతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ LRS పథకం అమలు కోసం సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వివరాలను తీసుకొని అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ చర్యలను చేపట్టాలని వార్డు ప్లానింగ్ కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు. LRS పథకం అమలు కోసం నియమించిన ప్రత్యేక సిబ్బంది నుంచి సహాయ సహకారాలు, ఇతర వివరాలను పొంది పథకం పూర్తిస్థాయిలో అమలయ్యేలా ప్లానింగ్ కార్యదర్శులు కృషి చేయాలని కమిషనర్ సూచించారు. ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాలను  చేరుకునేందుకు వార్డు సచివాలయ కార్యదర్శులు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ హిమబిందు, డిప్యూటీ సిటీ ప్లానర్ రఘునాథరావు,సిటీ ప్లానర్లు వేణు,మురళీ,టి. పి. బి. ఓ.లు, ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *