మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి: తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహ కాలనీలో ఉన్న 34వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరిస్తూ ఓటర్లతో కలసి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

