AP&TGDEVOTIONALOTHERS

శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం ఇచ్చిన దాత వర్థమాన్ జైన్

వర్ధమాన్ జైన్ టీటీడీకి ఇచ్చిన విరాళాలు:-

45 రకాల ఆభరణాలను 9 సెట్లు..

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిపై తనకున్న అపార భక్తిని చాటుకుంటూ చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వర్థమాన్ జైన్ ఏకంగా 121 కిలోల బంగారాన్నివిరాళంగా సమర్పించి ఆధ్యాత్మిక, కార్పొరేట్ వర్గాలను అబ్బుపర్చారు.తిరుమల చరిత్రలోనే అత్యంత భారీ వ్యక్తిగత బంగారు విరాళాల్లో ఒకటిగా నిలిచింది ఈ కానుక. శ్రీవారి కైంకర్యాల కోసం ఆయన సమర్పించారు.

ఇంతటి భారీ విరాళాన్ని అందించిన వర్థమాన్ జైన్, చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్, హెల్త్కేర్ బీపీఓ, ఐటీ, నిర్మాణ రంగాల్లో ఆయన అగ్రగామిగా నిలిచారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హెల్త్కేర్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ సంస్థ యాక్సెస్ హెల్త్కేర్ సహ వ్యవస్థాపకుడిగా, వైస్ ఛైర్మన్గా ఆయన వేలాది మందికి ఉపాధి కల్పించారు. గతంలో పెరోట్ సిస్టమ్స్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసి, ఆ సంస్థ డెల్ సర్వీసెస్లో విలీనమయ్యే ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. సుమారు రూ.8,292 కోట్ల నికర ఆస్తులతో దేశంలోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తల జాబితాలో ఆయన స్థానం సంపాదించుకున్నారు.

గత ఏడాది కూడా ఆరు కోట్లు..

చెన్నైలోని ప్రతిష్టాత్మక లయోలా కాలేజీ నుంచి స్టాటిస్టిక్స్లో పట్టభద్రుడైన వర్థమాన్ జైన్, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. వ్యాపారవేత్తగానే కాకుండా చెన్నై ఏంజెల్స్ సభ్యుడిగా పలు భారతీయ స్టార్టప్ కంపెనీల్లో ఏంజెల్ ఇన్వెస్టర్గా పెట్టుబడులు పెడుతూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారు. ఏషియా ఇంజనీర్ డైరెక్టర్గా, క్విబస్ రిసోర్సెస్ బోర్డు సభ్యుడిగా కార్పొరేట్ రంగంలో తనదైన ముద్ర వేశారు.

వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడమే కాకుండా, సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెనుకబడిన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు ఆవిష్కార్ సంస్థను స్థాపించడంతో పాటు, చెన్నైలోని కాంచీ కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీగా సేవలందిస్తున్నారు. గతంలోనూ చెన్నై టి.నగర్లోని టీటీడీ ఆలయ విస్తరణకు రూ.1.02 కోట్లు, టీటీడీ ట్రస్టులకు రూ.6 కోట్ల విరాళాలు ఇచ్చిన వర్థమాన్ జైన్, ఇప్పుడు ఏకంగా 121 కేజీల బంగారాన్ని శ్రీవారి పాదాల చెంత ఉంచి తన భక్తిని మరోసారి చాటుకున్నారు.

శ్రీవారికి సమర్పించిన 121 కిలోల కానుకలో కిరీటం,పాదుకలు, సాలగ్రామ హారాలతో సహా 45 రకాల ఆభరణాలను 9 సెట్లుగా రూపొందించారు.ఈ ఆభరణాలను ఇప్పటికే భారీ పెట్టెల్లో శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చారు

వర్ధమాన్ జైన్ టీటీడీకి ఇచ్చిన విరాళాలు:- వ్యాపారవేత్త వర్ధమాన్ జైన్ తిరుమల శ్రీవారికి విరాళం ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. 2024లో రూ.కోటితో చెన్నై ఆలయాన్ని విస్తరించారు. అదే ఏడాది NOVలో టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్కు రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు. 2025లో SV భక్తి ఛానలకు రూ.5 కోట్లు, గో సంరక్షణకు రూ.కోటి అందజేశారు. మే 2026లో తిరుమలకు ఎలక్ట్రిక్ బస్ విరాళంగా ప్రకటించారు. తాజాగా 121 కేజీల బంగారం ఇచ్చారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *