రోడ్డు దాటుతున్న నలుగురు భవానీలను ఢీకొట్టిన స్కార్పియో వాహనం-నాలుగురు మృతి
ఆసుపత్రికి తరలించే క్రమంలో ఒకరు మృతి..
మరమ్మత్తుల కారణంగా బస్సును రోడ్డు పక్కన..
అమరావతి: కాకినాడ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటున్న వెళ్తున్న భక్తులను వాహనం ఢీ కొట్టడడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన కత్తిపూడి రావికంపాడు జంక్షన్ దగ్గర చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా డెంకాడ నుంచి విజయవాడ అమ్మవారి దర్శనానికి భవాని భక్తులు ఓ ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. మార్గమధ్యలో బస్సు రిపేర్ రావడంతో నడుచుకుంటూ టీ తాగడానికి రోడ్డు క్రాస్ చేస్తున్న భక్తులను,స్కార్పియో ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా,మరోకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలనికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

