మన సంస్కృతి పట్ల ద్వేషాన్ని పెంచుకునే వారే మన దేశానికి శత్రవులు-ప్రధాని మోదీ
దేశంలోని శత్రువులను ఎదుర్కోవడానికి…
అమరావతి: మన సంస్కృతి పట్ల ద్వేషాన్ని పెంచుకునేవారు,సమాజాన్నివిభజించేవారు,దేశ గౌరవానికి హాని కలిగించే వీరే దేశ శత్రువులు అని, దేశంలోని శత్రువులను ఎదుర్కోవడానికి మనం ఐక్యంగా నిలబడాల్సిన సమయం వచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.తూర్పు దిల్లీలోని ఇంద్రప్రస్థ ప్రాంతంలో మంగళవారం జరిగిన దసరా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ “మన ఆలోచనలు సామరస్యంతో కూడినవిగా ఉండాలని, దేశ ప్రయోజనాల కోసం దేశంలోని అన్ని సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై నిలవాలి” అని అన్నారు. మనం ‘మా భారతి’కి శత్రువులైన వారిని గుర్తించి, వారిని ఓడించాలని పిలుపునిచ్చారు.
రాముడి నుంచి స్ఫూర్తి పొందాలి:- సుపరిపాలనకు రామరాజ్యం ఆదర్శంమైన నమూనా అని పేర్కొన్నారు. ప్రస్తుతం మన అందరి ముందు వికసిత్ భారత్ 2047 అనే లక్ష్యం ఉందని గుర్తుచేశారు. వికసిత్ భారత్ లక్ష్యసాధనలో రాముడి నుంచి స్ఫూర్తి పొందాలని ప్రధాని సూచించారు. భారతీయ పండుగలను ఐక్యరాజ్య సమితి కూడా గుర్తిస్తోందని,మన నాగరికతే మన గుర్తింపు అని స్పష్టం చేశారు. అనంతరం ప్రధాని మోదీ బాణాన్ని సంధించి రావణ, కుంభకర్ణల ప్రతిమలను దహనం చేశారు.

