AP&TGDEVOTIONALNATIONALOTHERS

మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా శ్రీ మలయప్పస్వామి

భక్తులను కటాక్షించిన శ్రీకృష్ణుడు..

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై భక్తులకు జగన్మోహనాకారంలో దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు అలంకృతులై భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ శ్రీవారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

మోహినీ అవతారం.. మాయామోహాల నుంచి విముక్తికి సందేశం:- మోహినీ అవతారం జగత్తును ఆవహించిన మాయామోహాలకు అతీతంగా భగవంతుని తత్త్వాన్ని గ్రహించాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. సమస్త జగత్తు భగవంతుని లీలా విలాసమని, ఆయన అనుగ్రహంతోనే మాయామోహాలను అధిగమించి ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగలమనే తత్త్వాన్ని ఈ అవతారం చాటిచెబుతుంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *