స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన SEC అనిల్ చంద్ర పునేఠా
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించేందుకు నోటిఫికేషన్ను విడుదల చేశారు. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు SEC ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 అర్బన్ లోకల్ బాడీలకు ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించారు.దింతో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఈనెల 28వ తేదిన ఎన్నికలు జరుగనున్నాయి.
పురపాలక:- మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నామినేషన్ల గడువు:– అక్టోబరు 18…ఉపసంహరణ గడువు:– అక్టోబరు 21…పోలింగ్ తేదీ:– అక్టోబరు 28…ఓట్ల లెక్కింపు:– అక్టోబరు 30.
ఎంపీటీసీ, జడ్పీటీసీ:-
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు.. నోటిఫికేషన్:– అక్టోబరు 19…నామినేషన్ల గడువు:– అక్టోబరు 23…ఉపసంహరణ గడువు:– అక్టోబరు 27…ఎన్నికల తేదీ:– నవంబరు 3…ఓట్ల లెక్కింపు: నవంబరు 5.
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు:- గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో…
గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబరు 26న తొలి విడత, నవంబరు 29న రెండో విడత, డిసెంబరు 2న మూడో విడత పోలింగ్ జరగనుంది. పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తొలి విడత ఎన్నికలు... నోటిఫికేషన్:- నవంబరు 13…నామినేషన్ల గడువు:- నవంబరు 17…ఉపసంహరణ గడువు:- నవంబరు 21…పోలింగ్ తేదీ:- నవంబరు 26. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
రెండో విడత ఎన్నికలు… నోటిఫికేషన్:- నవంబరు 16…నామినేషన్ల గడువు:- నవంబరు 20…ఉపసంహరణ గడువు:- నవంబరు 24…పోలింగ్ తేదీ:- నవంబరు 29.అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మూడో విడత ఎన్నికలు..నోటిఫికేషన్:- నవంబరు 19…నామినేషన్ల గడువు:- నవంబరు 23…ఉపసంహరణ గడువు:- నవంబరు 27…పోలింగ్ తేదీ:- డిసెంబరు 2… అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


