NATIONAL

రాష్ట్రాల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది-ప్రధాని మోదీ

UPI ద్వారా మెట్రో టికెట్ కొనుగోలు..

హైస్పీడ్ రైల్ కారిడార్లు-విజయ్..

అమరావతి: రాష్ట్రాల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని,సీఎం విజయ్‌తో కలిసి తమిళనాడు అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. తొలుత చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభోత్సవానికి తమిళనాడుకు చేరుకున్న ప్రధాని మోదీకి చెన్నై విమానాశ్రయంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం చెన్నై ట్రేడ్ సెంటర్, ఐఐటీ మద్రాస్ ఆవరణలోని కేంద్రీయ విద్యాలయ గ్రౌండ్స్‌ లో జరిగిన కార్యక్రమంలో రూ.13,000 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ఆదివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

UPI ద్వారా మెట్రో టికెట్ కొనుగోలు:- చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-2 కింద కారిడార్-4లోని పూనమల్లి-వడపళని మార్గాన్ని (సుమారు 15 కిలోమీటర్లు, 11 స్టేషన్లు) ప్రధాని మోదీ, సీఎం విజయ్‌తో కలిసి ప్రారంభించారు. పూనమల్లి బైపాస్ నుంచి పోరూర్ వరకు ఇరు నేతలు కలిసి మెట్రో రైలులో ప్రయాణించి, విద్యార్థులు, పౌరులతో ముచ్చటించారు. ప్రధాని మోదీ యూపీఐ (UPI) ద్వారా మెట్రో టికెట్ కొనుగోలు చేశారు.తూత్తుకుడిలోని చిదంబరనార్ పోర్ట్‌ ను ప్రపంచ స్థాయి గ్రీన్ ఎనర్జీ అండ్ మెగా కంటైనర్ హబ్‌గా మార్చడానికి రూ. 17,000 కోట్లతో పనులు వేగవంతం చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.

హైస్పీడ్ రైల్ కారిడార్లు-విజయ్:- కార్యక్రమంలో ప్రసంగించిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. చెన్నై మెట్రో ఫేజ్-3 పొడిగింపు (ఎయిర్‌పోర్ట్-కిల్‌పాక్కం, పూనమల్లి-సుంగువార్‌సత్రం) కు తక్షణమే ఆమోదం తెలపాలని ప్రధానిని కోరారు. చెన్నై నుంచి కన్యాకుమారి, చెన్నై నుంచి కోయంబత్తూర్ మార్గాల్లో హైస్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *