INTERNATIONALNATIONALOTHERS

సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ ఆందోళనలను అమెరికా అర్థం చేసుకోకపోతే ?- జైశంకర్

ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం..

అమరావతి: భారత్-అమెరికా సంబంధాల్లో ఉగ్రవాద అంశం అత్యంత కీలకమని,సరిహద్దు ఉగ్రవాదంపై తమ ఆందోళనలను అమెరికా తగినంతగా అర్థం చేసుకోకపోతే, అది ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పరోక్షంగా హెచ్చరించారు.ఇటీవల అమెరికా 100 శాతం టారిఫ్ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న నేపధ్యంలో (మంగళవారం) 29వ తేదిన న్యూయార్క్‌ లో ఆసియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ జయశంకర్ పై విధంగా వ్యాఖ్యనించారు.

ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం:- భారత్‌కు అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఉగ్రవాద నిర్మూలన ఒకటని, దశాబ్దాలుగా పొరుగు దేశం నుంచి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నామని,వందల మంది ప్రాణాలు తమ దేశం కోల్పోయిందని జైశంకర్ పేర్కొన్నారు. భారత్ ఎదుర్కొంటున్న ఈ సమస్యను భాగస్వామ్య దేశాలు అర్థం చేసుకోవడం, దాని తీవ్రతను గుర్తించడం అవసరమని స్పష్టం చేశారు. భారత్‌కు ఎంతో ముఖ్యమైన అంశంపై భాగస్వామి దేశం తగినంత అవగాహన లేదా సానుభూతి చూపకపోతే, అది ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందని కుండబద్దలు కొట్టారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *