రెబల్ స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ అవుట్!
నిజమే-నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా..
అమరావతి: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘స్పిరిట్’,, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ప్రభాస్ చిత్రం ‘స్పిరిట్’ నుండి సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ అధికారికంగా తప్పించారు. ఆయనను తొలగించడానికి కారణం ప్రకాష్ రాజ్, రాజకీయ వివాదస్పదమైన మాటలు,రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శడంమే కారణంగా తెలుస్తొంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలో ఇలాంటి వివాదస్పదమైన వ్యక్తుల కారణంగా ప్రభాస్ లాంటి హిరో సినిమాకు తీరని నష్టం వచ్చే అవకాశం వుంటుందని ఫిల్మిమ్ నగర్ లో చర్చ నడుస్తొంది.అయితే ఈ వార్తలను నటుడు స్వయంగా ఖండించినప్పటికీ, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా, ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని స్పష్టం చేశారు. అదే సమయంలో సినిమాకు సంబంధించిన పాత్రల పరిచయాలను, ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రకాష్ రాజ్ పేరును తొలగించినట్లు నిర్మాత ధృవీకరించారు.అలాగే ఈ సినిమాలో కొరియన్ స్టార్ డాన్ లీ (మా డాంగ్-సియోక్), చిరంజీవి నటించడం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా కూడా స్పష్టం చేశారు.

