మేయర్,మునిసిపల్ చైర్మన్ లకు ప్రత్యక్ష ఎన్నికలు-బిల్లుకు శాసనసభ అమోదం-మంత్రి నారాయణ
1986 నుంచి 2005 వరకూ మేయర్,మునిసిపల్ ఛైర్మన్ ల ప్రత్యక్ష ఎన్నికలు..
2005 నుంచి పరోక్ష ఎన్నికలు..
చట్ట సవరణతో మళ్లీ ప్రత్యక్ష ఎన్నికలు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టంలోని శాసనాల 4వ సవరణ బిల్లును మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టాగా,బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.ఇకపై మేయర్,మున్సిపల్ ఛైర్మన్ ల ఎంపికకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. 1986 వరకూ మేయర్,మునిసిపల్ ఛైర్మన్ ల ఎంపికకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగేవి అటు తరువాత 2005 నుంచి ఇప్పటివరకూ పరోక్ష ఎన్నికలు జరుగుతున్నాయి.ప్రస్తుతం చేస్తున్న చట్ట సవరణతో ఇక నుంచి ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యక్ష ఎన్నికలతో మేయర్, మునిసిపల్ ఛైర్మన్ ఎంపికతో అనేక ప్రయోజనాలు ఉంటాయని,ఇలా ఎంపికైన వారికి బలమైన ప్రజామోదం ఉంటుందన్నారు. కౌన్సిలర్లు,కార్పొరేటర్ల ప్రభావం మేయర్ లేదా ఛైర్మన్ పై ఉండదని, మేయర్,ఛైర్మన్ వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. సుదీర్ఘ అభివృద్ది ప్రణాళికలు అమలుపరిచే అవకాశం ఉంటుందని, వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ది పనులు వేగవంతం చేయవచ్చు అని తెలిపారు. పెట్టుబడిదారులు,పరిశ్రమలు,టూరిజంను మేయర్ లేదా ఛైర్మన్ యాక్టివ్ గా ప్రమోట్ చేసే అవకాశం ఉంటుందన్నారు. మేయర్ లేదా ఛైర్మన్ పై రాజకీయ ప్రభావం తగ్గుతుందని,అలాగే అన్ని వర్గాల ప్రజలకూ అవసరమైన పనులు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

