DISTRICTS

వికసిత్ భారత్ సాధనలో యువత భాగస్వామ్యం కీలకం-జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్

2047 నాటికి వికసిత్ భారత్ దిశగా..

నెల్లూరు: నెల్లూరు కలెక్టరేట్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల కలెక్టరేట్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 100 అడుగుల స్తూపం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. చిన్నారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, భారత్ మాతాకీ జై నినాదాలు చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువతపై ఎంతో పెద్ద బాధ్యత ఉందన్నారు. స్వర్ణాంధ్ర, స్వర్ణ భారత్, వికసిత్ భారత్ దిశగా మనం ప్రయాణం ప్రారంభించామని తెలిపారు.2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు రాబోయే సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్:- మనకు స్వాతంత్ర్యం అందించేందుకు మహాత్మా గాంధీ, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను, వారు పడిన కష్టాలను మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని కలెక్టర్ అన్నారు. వారి త్యాగాల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో దేశాభివృద్ధిలో మనం కూడా ఏదో ఒక విధంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

వికసిత్ భారత్ దిశగా:- రాబోయే సంవత్సరాల్లో మరింత కష్టపడి 2047 నాటికి స్వర్ణాంధ్ర, స్వర్ణ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించే దిశగా పనిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జిల్లా కలెక్టర్‌గా ప్రతి ఒక్కరికీ తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నానని, తమకు సాధ్యమైనంత మేరకు భారతదేశ అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. దేశ ఐక్యత కోసం పనిచేయడంతో పాటు మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *