ఆగష్టు 15వ తేదిన ఢిల్లీలో బాంబులు పేలుస్తామంటూ బెదిరింపులు
ఢిల్లీని ఖలిస్తాన్‌లో భాగంగా చేయాలనే..
అమరావతి: దేశం 80వ స్వాతంత్య్ర దినొత్సవ వేడుకలకు సిద్దమౌవుతున్న సమయంలో దేశ రాజధాని ఢీల్లీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని ఎయిర్‌పోర్టు, ఎర్రకోట, హైకోర్టు,రైళ్లలో పేలుళ్లకు పాల్పడతామని హెచ్చరిస్తూ, శుక్రవారం అధికారులకు ఒక ఈమెయిల్ వచ్చింది. ఆగష్టు 15వ తేదిన ఈ పేలుళ్లు జరుపుతామని,అందులోనూ ఢిల్లీ హైకోర్టును ఆగష్టు 15వ తదిన మధ్యాహ్నం 2.11 గంటలకు పేల్చేస్తామని మెయిల్‌లో పేర్కొన్నారు.
ఢిల్లీని ఖలిస్తాన్‌లో భాగంగా చేయాలనే లక్ష్యంతో ఈ పేలుళ్లు జరుపుతామని మెయిల్‌లో పేర్కొన్నారు.1984లో జరిగిన సిక్కు అల్లర్ల కేసులో బాధిత సిక్కులకు కోర్టు న్యాయం చేయలేకపోయిందని, అందుకే ఢిల్లీ హైకోర్టును టార్గెట్ చేశామని మెయిల్‌లో వెల్లడించారు. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 3ని కూడా పేల్చేస్తామన్నారు. జామ్‌నగర్ హౌజ్, ఝండేవాలన్ బిల్డింగ్ కూడా తమ దృష్టిలో వున్నయని పేర్కొనడంతో,ఢిల్లీ పోలీసులు, భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించారు. బాంబు బెదిరింపులు ఉన్న ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గట్టి నిఘా, తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకల కోసం ఢిల్లీ నగరంలోని ఎర్రకోట ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

