ఆనం అంటే అభివృద్ది కాదు…అవినీతి మాత్రమే-మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
ఆనంపై తీప్ర ఆరోపణలు..
రెండేళ్లకో పార్టీ మారే మీరా మమ్మల్ని విమర్శించేది..
ఎవరికి సిగ్గులేదో ప్రజలందరికి తెలుసు..
ఇసుక కొండను మాయం చేశారు..
ఏడు మంది ఇసుక ట్రిప్పర్ ఢీకొని మరణిస్తే..
పోలిసులు వద్ద కూడా కమిషన్:..
అమరావతి: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అంటే అభివృద్ది కాదని, అవినీతి దోపిడి అని, ఇదే నేనంటున్న మాట కాదు ఆయన ఏ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించినా అక్కడి ప్రజలే ఈ మాట చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని మేకపాటి నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 రోజుల క్రితం మర్రిపాడులో పర్యటించిన మంత్రి ఆనం తన సభలో టీడీపీ కార్యకర్త హైలెవల్ కెనాల్ పనులకు సంబంధించి ప్రశ్నిస్తే మర్రిపాడువాసులకు సిగ్గులేదంటూ మాట్లాడడం జరిగిందని, అడిగిన ధానికి సమాధానం చెప్పకుండా ఇలా మా కుటుంబం మీద మాట్లాడి ఏం ఒరగబెట్టినట్లు అవుతుందన్నారు.
ఇసుక కొండను మాయం చేశారు:- మర్రిపాడు వాసులకు సిగ్గులేదా అని ప్రశ్నిస్తున్న మంత్రి ఆనం తాను గెలిచిన సాయంత్రమే మర్రిపాడులో ఇసుక కొండను మాయం చేశారని, రెండు రోజుల అనంతరం ఆయన ఇంటి ముందు రెండు కొత్త వాహనాలు కనిపించాయని, నియోజకవర్గంలో ఇసుక మాఫియాను ఏర్పాటు చేశారని, ఏటికి ఒక వైపు ఒకరిని, అవతలి వైపు మరోకరిని పెట్టి దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
ఏడు మంది ఇసుక ట్రిప్పర్ ఢీకొని మరణిస్తే:- మీ ధన దాహానికి ఏడు మంది ఇసుక ట్రిప్పర్ ఢీకొని చనిపోతే ఇప్పటి వరకు ఆ కుటుంబాలను కనీసం పరామర్శించిన పాపాన పోలేదని, చేజర్ల మండలంలో సుమారు 150 ఎకరాల్లో ఉన్న జామాయిల్ ను పోలిసుల సమక్షంలోనే బద్వేల్ కు చెందిన వ్యక్తులతో రాత్రికి రాత్రే తరలించారని, ఆఖరికి చికెన్ వేస్ట్ కూడా అమ్ముకుంటూ ప్రజారోగ్యానికి హానికరం కలిగిస్తున్నారని, దీనిని స్వయంగా తానే మీడియా ద్వారా చూపించడం జరిగిందని, ఇలాంటి పనులు చేస్తున్న మీకు సిగ్గుండాలన్నారు.
పోలిసులు వద్ద కూడా కమిషన్:- ఈ ప్రాంతానికినీళ్లు తెచ్చేది నేనే ఇచ్చేది నేనే అంటున్నారు అంటున్న ఆనం ఒక్కసారి చరిత్ర చూడాలని, వెంకటగిరిలో రిజర్వాయర్ నిర్మాణానికి మీకు కమిషన్ సెట్ కాలేదని ఆ పనులు నిలిపివేశారని, పోలిసులు వద్ద కూడా కమిషన్ తీసుకున్న చరిత్ర మీదని ప్రజలు అంటున్నారని, సోమశిల స్పిల్ వే నిర్మాణానికి ఇప్పటికే కాంట్రాక్టర్లు మారారే కానీ అతి ముఖ్యమైన ఆ పని మాత్రం చేయలేదన్నారు.
రెండేళ్లకో సారి పార్టీ మారే మీమీద:- మీ మీద కేసులు లేవంటేమీ గొప్పతనం కాదు, రెండేళ్లకో సారి పార్టీ మారే మీమీద ఎందుకుంటాయని, ఒకే పార్టీలో కొనసాగేమా మీద ఉంటాయని, మేము ధైర్యంగా వాటిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఇప్పుడు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వచ్చే దమ్ముందా అని సవాల్ చేశారు.

