AP&TGHEALTHOTHERS

దేశంలోనే తొలిసారిగా ‘తల్లీబిడ్డ”ఎక్స్ ప్రెస్ వాహనాల్లో అత్యాధునిక సదుపాయాలు

తొలిదశలో 300 అధునాతన వాహనాల రెడీ..

అమ‌రావ‌తి: దేశంలోనే తొలిసారిగా తల్లీ బిడ్డల భద్రత, ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోని అత్యాధునిక వాహనాలను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో డిజైనింగ్, బ్రాండింగ్‌ను ఖరారు చేశారు. తల్లులు, నవజాత శిశువులు సులభంగా ఎక్కడం, దిగడం, ప్రయాణంలో భద్రత, అవసరమైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని వాహనాలు రూపొందిస్తున్నారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తల్లి, శిశువులకు ఎదురయ్యే రవాణా సమస్యను తొలగించడం, ప్రసవానంతర సంరక్షణను మెరుగుపరచడం, అధిక ప్రమాద (హైరిస్క్‌) గర్భిణులకు అవసరమైన సమయంలో రవాణా అందించడం ద్వారా మాతా, శిశు మరణాలను తగ్గించడమే ఈ సేవల ప్రధాన లక్ష్యం. కొత్త వాహనాల ప్రారంభ కార్యక్రమం ఆగస్టు 11న నరసరావుపేటలో జరగనుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ నూతన వాహన సేవలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ కార్యక్రమా నికి అనుగుణంగా జిల్లాల్లోనూ కొత్త వాహనాల సేవలు ప్రారo భం కానున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసావాలకు గర్భిణులకు మాత్రమే సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ఓ ప్రకటన తెలిపారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవిo చిన వారికి మాత్రమే:- రాష్ట్రవ్యాప్తంగా ‘102 ‘ (త‌ల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహ‌నాలు) సేవ‌ల్ని  ఆధునిక విధానం  మరింత విస్తరించేందుకు ప్రభుత్వం మొత్తం 500 వాహనాలను సమకూర్చుతోంది. తొలిదశలో 300 వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మిగిలిన 200 వాహనాలను త్వరలో అందుబాటులోనికి రానున్నాయి. సదరు జిల్లాల్లో ప్రసవాల ఆధారంగా ఈ వాహనాలు కేటాయించారు.

ప్రయాణంలోనే:- డ్రైవర్‌ యాప్‌ మ్యాపింగ్‌, కాల్‌సెంటర్‌ అనుసంధానం, ఆర్‌సీహెచ్‌ (RCH) ధ్రువీకరణలను ఐటీ వ్యవస్థలోకి తీసుకొచ్చారు. జీపీఎస్‌ ద్వారా వాహనం ఎక్కడ ఉందో తెలుసుకుని, అందుబాటులో ఉన్న వాహనాన్ని అవసరమైన చోటుకు కేటాయించడం, ప్రయాణాన్ని పర్యవేక్షించడం సులభమవుతుంది. రాష్ట్రంలోని ఏ ఫోన్‌ నుంచైనా టోల్‌ఫ్రీ 102ను సంప్రదించవచ్చు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *