AP&TGDEVOTIONALOTHERS

పెరుమాళ్లపాడు నాగేశ్వరస్వామి ఆలయం,కల్కి సినిమాలో సన్నివేశం

కల్కి సినిమాలో సన్నివేశం, పెరుమాళ్లపాడు
నెల్లూరు: ఎదైన దేవాలయంలోని హుండీలు డబ్బులు దండిగా పడుతున్నాయి అంటే చాలా,బెల్లం వాసన పసికట్టే చీమాల్ల దేవాదాయ,ధర్మదాయశాఖ అధికారులు సదరు గుడి ముందు వాలిపోతారు.ఈ గుడికి హుండీ ఆదాయం ఇంత వుంది కాబట్టి ఇక నుంచి ఈ దేవాలయం ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ పరిధిలోకి వస్తుందంటూ,అంక్షలు పెడుతారు.ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా హుండీకి వచ్చే అదాయంను,మాన్యలు వుంటే వాటి ద్వారా వచ్చే ఆదాయుంను కైంకర్యం చేయడం మొదలు పెడతారే తప్ప దేవాలయంకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యలు,రవాణా మార్గలను గురించి పట్టించుకున్న పాపాన పోరు అనేది భక్తుల నానుడి..
ఈ కోవలోకి వస్తున్నదే
నెల్లూరుజిల్లా చేజర్ల మండలం పరిధిలోని పెరుమాళ్లపాడు నాగేశ్వరస్వామి దేవాలయం.దాదాపు 100 సంవత్సరల పైబడి ఇసుక దిబ్బల క్రింద కప్పబడి పోయింది. పెరుమాళ్లపాడు నాగేశ్వరస్వామి దేవాలయం……………
దాదాపుగా అనుకుని పెన్నానది ప్రవహిస్తుండం,పెన్నానదికి వరద వచ్చినప్పుడు ఈ ప్రాంతం దాదాపు నీటిలో మునిగిపోయే పరిస్థితి వుండేది..దింతో వరదకు కొట్టుకుని వచ్చిన ఇసుక 20 నుంచి 30 అడుగుల ఎత్తున మేటలు వేసింది.100 సంవత్సరాల క్రిందట దేవాలయంను అనుకునే పెరుమాళ్లపాడు గ్రామం వుండేది. ఈ ప్రాంతంలో వున్న నాగేశ్వరస్వామికి నిత్య పూజలు జరిపేందుకు దేవాలయంను నిర్మించిన దాతలు కుమ్మరులు,మంగలి,చాకలి,భోగం వాళ్లకు మాన్యలు ఇచ్చి,,దేవాలయం అవసరల మేరకు వీరు సేవాలు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు..వీరికి ఇచ్చిన మాన్యలు కాకుండా స్వామివారికి దాదాపు 84 ఏకరాలు పొలం కూడా రాసి ఇచ్చారు..పొలంపైన ఇప్పటి వరకు వచ్చిన రాబడి రమారమి రూ.50 లక్షల వరకు వుంటుందని గ్రామస్తులు తెలిపారు.
150 కుటుంబలు వరకు ఈ గ్రామంలో వుండే వారు..ఇసుక దిబ్బలపై నుంచి వీచే గాలితో, ఇసుక, గ్రామస్తులు తినే తిండి,బట్టలపై వీపరితంగా పడుతున్న నేపధ్యంలో గ్రామస్తులు అక్కడి నుంచి గ్రామాన్ని 2 కీ.మీ దూరంగా అవతలికి మార్చుకున్నారు..అక్కడే నివాసించడం మొదలు పెట్టారు.ఇదే సమయంలో దేవాయంలో వున్న పలు విగ్రహాలు,పూజ సామాగ్రిని అప్పటి ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ అధికారులకు అప్పగించారు.వీటి విలువ నేడు దాదాపు రూ.11 కోట్ల వరకు వుంటుందని దేవాలయ కమిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు.
గ్రామస్తులు దూరంగా ఉరిని మార్చుకున్న తరువాత ఇసుక దిబ్బలు అంతకంతకు పెరిగిపోయాయి దేవాలయంను పూర్తిగా కప్పివేశాయి..దేవాలయంకు గ్రామస్తుల రాక కూడా తగ్గిపోవడంతో,,నాగేశ్వరస్వామిని పట్టించుకోవడం మానివేశారు..ఇలా దాదాపు 100 సంవత్సరాలు జరిగి పోయింది..కరోనా సమయంలో గ్రామంకు చెందిన కొందరు యువకులు చొరవ తీసుకుని,ఇసుక దిబ్బల క్రింద పూడిపోయిన దేవాలయంను మెషీన్ల సాయంతో కొంత మేరకు బయట పెట్టారు..దాదాపు శిధిలావస్థకు చేరుకున్న దేవాలయంను పూర్తిగా బయటకు తీస్తే,దేవాలయం పూర్తిగా కూలిపోతుందని,,కాబట్టి దానిని తాక వద్దంటూ ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు,గ్రామస్తులను కట్టడి చేశారు.అప్పటి నుంచి గ్రామస్తులు పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు,,జిల్లా స్థాయి అధికారుల చుట్టు తిరుగుతు,,దేవాలయంకు పూర్వవైభవం తెచ్చేందుకు సహరించాలంటూ విజ్ఞప్తులు చేస్తునే వున్నారు.అయిన పట్టించుకున్న నాధుడు ఎక్కడ ?
కల్కి సినిమా డైరెక్టర్ నాగశ్విన్ వద్ద అస్టిసెంట్ గా పనిచేస్తున్న నెల్లూరుజిల్లాకు చెందిన ఒక వ్యక్తి,,ఈ దేవాలయం గురించి డైరెక్టర్ కు తెలియచేశారు.ఆలయం ప్రాచుర్యం గురించి తెలుసుకున్న, నాగశ్విన్, కల్కి సినిమాలో అమితాబచ్చ్ కన్పించే సన్నివేశంలో ఒక సీన్ ఈ దేవాలయం గురించి చూపించారు.దింతో ఈ దేవాలయంకు ఎక్కడ లేని ప్రాచుర్యం వచ్చింది.నెల్లూరు జిల్లాకు చెందిన వారే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది పర్యాటకు,భక్తులు ఈ దేవాలయం సందర్శిస్తున్నారు.అయితే సినిమాలో చూపించిన విధంగా ఇక్కడ లేక పోవడం,,కనీసం దేవాలయంను పూర్తి స్థాయిలో జీర్ణనోద్దారణ చేయక పోవడంతో,,ఇంత దూరం వచ్చిన నిరాశతో వెనుతిరుగుతున్నారు..ప్రస్తుతం దేవాదాయశాఖ మంత్రిగా జిల్లాకు చెందిన ఆనం.రామనారాయణరెడ్డి వుండడంతో,గ్రామస్తుల్లో దేవాలయం జీర్ణనోద్దారణపై ఆశలు చిగురించాయి..
ఎంతో చరిత్ర వున్నాయి ఇలాంటి దేవాలయాలను పూర్తి స్థాయిలో జీర్ణనోద్దారణలు చేస్తే,,పర్యటకంగా కూడా స్థానికులకు ఉపాధి లభించే అవకాశం కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహాం అవసరం లేదు.మరి ఎన్డీఏ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *