శాంతి చర్చలకు సిద్దం-రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
అమరావతి: గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడే దిశగా అడుగుడులు పడుతున్నాయి..అగష్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా శాంతి కోసం ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు..ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు చేసేందుకు భారతదేశం సిద్ధంగా ఉందన్నారు..ప్రధాని నరేంద్ర మోదీ ఇటివల రష్యా, ఉక్రెయిన్‌లను సందర్శించిన తరువాత రెండు దేశాల నుంచి శాంతి చర్చల కోసం ప్రకటన రావడం విశేషం..ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో భాగంగా భారతదేశం, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించగలవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో పేర్కొన్నారు..
పుతిన్ షరతులు:- యుద్ధాన్ని ఆపేందుకు రష్యా విధించిన షరతుల ప్రకారం డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి..అలాగే ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో భాగస్వామ్యం ఉండకూడదు..ఈ నిబంధనలను ఉక్రెయిన్ అంగీకరించడానికి నిరాకరించింది..రష్యా తన దళాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది..శాంతి చర్చలకు ముందుకు సాగుతాయో లేదొ వేచి చూడాలి?