NATIONAL

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి కోడిగుడ్లుతో నిరసన

అమరావతి: పశ్చిమ బెంగాల్‌ మమతా బెనర్జీ బంధువు,టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన సంఘటన చోటు చేసుకుంది.శనివారం సోనార్‌పూర్‌ ప్రాంతాన్ని అభిషేక్‌ బెనర్జీ,ఎన్నికల అనంతర హింసాకాండ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ఆయనపై కోడిగుడ్లు, రాళ్లు విసురుతూ, “చోర్ చోర్” అంటూ స్థానిక బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. స్థానికులైన బీజేపీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగడంతో, అభిషేక్‌ బెనర్జీ పోలీసులు ధరించే హెల్మెట్‌ ధరించి సదరు ప్రాంతం నుంచి సెక్యూరిటీ సిబ్బంది సాయంతో వచ్చేశారు. తన పర్యటన గురించి ముందస్తు సమాచారం అందించినప్పటికీ, తగినంత భద్రత కల్పించలేదని అభిషేక్‌ బెనర్జీ ఆరోపించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *