సమిష్టి కృషితో మహానాడును విజయవంతం చేస్తాము-మంత్రి నారాయణ
నెల్లూరులో తొలిసారి మహానాడు..
5 లక్షల మందితో బహిరంగసభ..
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ ఏడాదికోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకొనే మహానాడుకు తొలిసారి నెల్లూరు జిల్లా వేదిక కాబోతోంది .ఈనెల 27 నుంచి 3 రోజుల పాటు జరగనున్న మహానాడుకు సుమారు 5 లక్షల మంది ప్రతినిధులు,కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నామని పురపాలకశాఖ మంత్రి డా.పొంగూరు.నారాయణ అన్నారు. శనివారం వేదిక ఎంపిక కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ,సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు,టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ,రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ , టీడీపీ రాష్ట్రస్థాయి నేత జయరామిరెడ్డి, ముఖ్యనేతలతో కూడిన టీడీపీ బృందం కోవూరు ,నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో స్థలాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడిమాతో మాట్లాడుతూ జిల్లా నేతలందరూ సమన్వయం చేసుకొంటూ సమిష్టి కృషితో మహానాడును దిగ్విజయం చేస్తామన్నారు. ఈ కార్యమంలో ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర ,సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,జిల్లాపార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

