రేపటి నుంచి ఇంటింట జనగణన సర్వే-కమిషనర్ నందన్
నెల్లూరు: మే 1వ తారీకు శుక్రవారం నుంచి ఇంటింటి జనగణన సర్వే కొసం ముందుగా సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు కలిసి మీకు అందజేసిన మ్యాప్ ప్రకారం ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి అలాగే పూర్తిగా అవగాహన కల్పించుకొని వాటి ప్రకారం ప్రతి ఇల్లు సర్వేలో పరిధిలో వచ్చే విధంగా సర్వే నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్-ప్రిన్సిపాల్ సెన్సస్ ఆఫీసర్ వై.ఓ నందన్ జనగణన అధికారులకు సూచించారు.గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు సెన్సస్ సూపర్వైజర్స్, ఎన్యుమరేటర్స్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదేవిధంగా జనగణన సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా సర్వే సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.
ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించాలి:- మే ఒకటి నుంచి జరుగు జనగణన సర్వేకు నగర ప్రజలందరూ సర్వే సిబ్బందికి పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా నగర ప్రజలను కమిషనర్ ఒక ప్రకటన ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ స్వర్ణ గ్రామాలు స్వర్ణ వార్డులు అదనపు కమిషనర్ హిమబిందు, చార్జ్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

