కార్పొరేషన్ లో అవినీతికి ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవు-మంత్రి నారాయణ
ప్రభుత్వ భూముల జోలికి…
నెల్లూరు: ప్రభుత్వ భూముల జోలికి ఎవరూ వెళ్లొద్దని,,అలాగే కార్పొరేషన్ లో అవినీతికి ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పురపాకశాఖామంత్రి నారాయణ హెచ్చరించారు..మంగళవారం అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంలో మంత్రి మాట్లాడుతూ పార్టీ కోసం,ప్రజాసమస్యల కోసం పనిచేసే వారందరూ నాకు సమానమే అన్నారు..ప్రజలు మన నుంచి సేవాలు కోరుకొంటున్నారు,,వారి అంచనలకు అనుగుణంగా పని చేస్తేనే రాజకీయాల్లో రాణించగలం అని మంత్రి నారాయణ అన్నారు..2019 -2024 ఫలితాల్లో ఆ తేడా స్పష్టంగా కనిపించిందని అన్నారు…
వీఆర్ హైస్కూల్ లో అడ్మిషన్స్:- 46 పార్కుల్లో వారం రోజుల్లో జరిగిన పనుల వీడియో క్లిప్స్ ను మంత్రి పరిశీలించారు..పనులు చేసిన వారి బిల్లులు వెంటనే చెల్లించమని కమీషనర్ సూర్యతేజను మంత్రి ఆదేశించారు..బిల్లులు అందగానే మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ లకు సూచించారు..పెద్దపార్కుల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలన్నారు.. మోడల్ గా సిద్ధం చేస్తున్న వీఆర్ హైస్కూల్ లో అడ్మిషన్ లు కల్పిద్దామని,,వీఆర్ హైస్కూల్ పునరుద్ధరణ లక్ష్యాన్ని నెరవేరుద్దాం అన్నారు..అలాగే విద్యార్థులకోసం ఎలెక్ట్రికల్ బస్సు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు..
200 రోజుల పాటు కుక్కల వాక్సినేషన్:-రాష్ట్రవ్యాప్తంగా కుక్కల బెడద తగ్గించటానికి అవసరమైన చర్యలు చేపట్టడడం జరిగిందని,,రాష్ట్రంలో దాదాపు 2 లక్షల కుక్కలను గుర్తించడం జరిగిందని,,రోజుకి 1000 కుక్కలకి స్టెరిలైజేషన్ చేయమని ఆదేశాలు జారీ చేసామన్నారు..