అందరి ఆశీస్సులతో మార్క్ శంకర్ కోలుకొంటున్నాడు-పవన్ కళ్యాణ్
హైదరాబాద్: మా చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.మార్క్ శంకర్ క్రమంగా కోలుకొంటున్నాడని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,హైదరాబాద్ లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు..తన పెద్ద కుమారుడు అకీరా పుట్టిన రోజు నాడే,,రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరమని తెలిపారు..
సింగపూర్‌లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్‌లో మంగళవారం ఉదయం 9.45 గంటలకు అగ్నిప్రమాదం సంభవించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి..ఈ భవనంలో 30 మంది చిన్నారులకు సమర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం..రెండు,మూడు అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది..ఈ భవనంలో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది రక్షించి బయటకు తీసుకొచ్చారు..ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మరణించినట్లు తెలిసింది..ఇందులో మొత్తం 19 మంది గాయపడ్డినట్లు తెలుస్తొంది..వీరిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
ప్రమాద విషయం తెలుసుకొని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఫోన్ చేసి మార్క్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసి ధైర్యం చెప్పారు. సింగపూర్ లో అవసరమైన సహకారం అందించవలసిందిగా అక్కడి హై కమిషనర్ కు దిశానిర్దేశం చేశారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేసి మాట్లాడారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..వారికి నా ధన్యవాదాలు.. నాయకులు, కార్యకర్తలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.ఇంతమంది మంచి మనసుతో ఆకాంక్షించి, ఆశీస్సులు అందించడంతో మార్క్ శంకర్ క్రమంగా కోలుకొంటున్నాడు. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పారు.