వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా ‘దానా’
అమరావతి: తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘దానా’ తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతున్న తుపాన్ పారాదీప్ కి 460కిమీ., ధమ్రా కు 490కిమీ.,సాగర్ ద్వీపానికి 540కిమీదూరంలో కేంద్రీకృతం రేపు తెల్లవారుజామునకు వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ వెల్లడించింది.. శుక్రవారం తెల్లవారుజాములోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా,,ధమ్రా (ఒడిశా) సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం వుందన్నారు..గురువారం ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉండి చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం.. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉండి చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.. కుళం,విజయనగరం,మన్యం, అల్లూరి,విశాఖ, అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి గంటకు 80-100కిమీ వేగంతో ఈదురుగాలులు ప్రజలు బలమైన ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.