మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన మాట వాస్తవమా.. కాదా?-వైసీపీ
అమరావతి: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మద్యం ధరలు తగ్గిస్తామంటూ ఇచ్చిన వాగ్దనాలపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాని నిలదీసింది..ఇందుకు G.Oలను జతచేస్తూ ప్రకటన విడుదల చేసింది..మద్యం ధరలు పెంచి కూడా బుకాయింపులా ? ధరలు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన మాట వాస్తవమా.. కాదా? అన్ని బ్రాండ్ల మద్యం ధరలు పెంచుతూ జీవో కనిపిస్తున్నా అబద్ధాలా? క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగిందన్నది వాస్తవమా.. కాదా? మద్యం సిండికేట్ల ద్వారా ఇప్పటికే కోట్ల రూపాయలు కొల్లగొట్లింది నిజమా కాదా? అది చాలక ఇప్పుడు మార్జిన్ల పెంపుతో మరింత దోపిడీకి సిద్ధమవడం వాస్తవమా..కాదా? అబద్ధాలకు రెక్కలు కట్టే ఫేక్ పార్టీ మీది కాదా? ముందు వీటికి సమాధానం చెప్పాలని కోరింది.