మాఘపౌర్ణమి సందర్బంగా పుణ్యస్నానాలు అచరించిన 1 కోటి 83 లక్షల మంది భక్తులు
అమరావతి: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తుల రాక అంతకంతకు పెరిగిపోతుంది..త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు రైళ్లు,బస్సులు,కార్లతో పాటు కాలి నడకన చేరుకుంటున్నారు..బుధవారం మాఘ పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.. మాఘ పూర్ణిమ మంగళవారం సాయంత్రం 6.55 గంటలకు ప్రారంభమై బుధవారం రాత్రి 7.22 గంటలకు ముగుస్తుంది..పవిత్ర త్రివేణీ సంగమంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకూ దాదాపు 1 కోటి 83 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్లు యూపీ అధికారులు వెల్లడించారు..మాఘ పౌర్ణమి స్నానాలు నేటి సాయంత్రం 7:22 వరకూ కొనసాగనున్నాయి..దాదాపు 2 నుంచి 3 కోట్ల మంది నేడు సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు..
ఇదే సమయంలో కుంభమేళా ప్రాంతానికి దాదాపు 15 కిలోమీటర్ల మేర రద్దీ నెలకొంది.. భక్తులపై యోగీ అథిత్యనాధ్ ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా భక్తులపై 25 క్వింటాళ్ల పూల వర్షం కురిపించారు..జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమై ఫిబ్రవరి 26వ తేది శివరాత్రి వరకూ కొనసాగుతుంది..45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 55 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.. ఇప్పటివరకు 46.25 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు.