స్థానిక ఎన్నికల్లో టీడీపీకి కార్పొరేటర్లు లేక పోయిన డిప్యూటివ్ మేయర్లు ఎలా గెలిచారు-జగన్
అమరావతి: స్థానిక ఎన్నికల్లో టీడీపీకి బలం లేక పోయిన డిప్యూటివ్ మేయర్లు ఎలా గెలిచారు అంటూ వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు,మాజీ సీ.ఎం జగన్ కూటమి ప్రభుత్వంను నిలదీశారు..బుధవారం గుంటురు నాయకులతో నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడుతూ ఐదేళ్ల మన పాలనలో రెండేళ్లు కరోనా సమయమే ఉండింది.. కార్యకర్తలకు చేయగలిగినంత చేయలేకపోయాం.. జగన్ 2.Oలో ప్రజలకు తోడుగా ఉంటూనే.. మరోవైపు ప్రతి కార్యకర్తకూ అన్నగా, అండగా ఉంటాను.. గతంలో మూడేళ్ల పాలన తర్వత స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీకి ప్రజలు పట్టం కట్టారు.. నేడు చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్నది ఓతప్పుడు సాంప్రదాయం.. ఇదా మనకు కావాల్సిన ప్రజాస్వామ్యం? అంటూ ప్రశ్నించారు.