AP&TGCRIME

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

అమరావతి: 2019లో టీడీపీ తరపున గన్నవరం గెలిచిన మాజీ ఎమ్మెల్యే,, వైసీపీ ఎమ్మేల్యేగా చెలమణి అయిన వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ విజయవాడ పటమట పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో రాయదుర్గం పోలీసుల సహకారంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.. వంశీని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పోలీసులు తరలించారు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గన్నవరంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీకి చెందిన పలువురు నాయకులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసి,, అక్కడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు..ఈ సంఘటనపై అప్పట్లొ టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండేదుకు ముందస్తు బెయిల్‌ను కూడా వంశీ తీసుకున్నారు..

ఈ కేసులో ముందస్తు బెయిల్‌ ఉండగా తనను ఎలా అరెస్టు చేస్తారని ఏపీ పోలీసులను వల్లభనేని వంశీ ప్రశ్నించారు.. అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన కేసులో అరెస్టు చేయడం లేదని పోలీసులు తెలిపారు.. మరో కేసులో అరెస్టు చేస్తున్నామని వివరించారు..టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిపై కంప్యూటర్‌ ఆపరేటర్‌ సత్యవర్ధన్‌ అప్పటల్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు..అయితే సత్యవర్థన్‌ను కిడ్నాప్, దాడి చేసి కేసు వెనక్కు తీసుకునేలా వంశీ అనుచరులు బెదిరించడంతోనే కేసు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం..

తనపై కేసు పెట్టిన వారిని భయపెట్టి కేసు లేకుండా చేయాలని కొద్దిరోజులుగా వంశీ కుట్ర పన్నాడని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు..తనపై కేసు లేకుండా చేయాలనే కుట్రతో,, కొత్త కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ చిక్కుకున్నాడని తెలిపారు..పోలీసులు ఇచ్చిన ధైర్యంతో ఫిర్యాదు దారుడు సత్యవర్థన్ వాస్తవాలను బయటపెట్టాడని తెలుస్తొంది.. వంశీపై విజయవాడ పటమట పోలీసులు BNS సెక్షన్‌ 140(1), 308, 351(3), రెడ్‌ విత్‌ 3(5), SC-ST అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు..సాక్ష్యాలు, ఆధారాలు పక్కాగా సేకరించిన దర్యాప్తు అధికారులు,, వంశీని అరెస్టు చేశారని తెలియ వచ్చింది..మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చారు..అక్కడే ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *