ఆంధ్రప్రదేశ్, డ్రోన్ టెక్నాలజీ హబ్ గా మారుతుందిముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్, డ్రోన్ టెక్నాలజీ హబ్ గా మారుతుందని,,భవిష్యత్తులో ఈ టెక్నాలజీ, గేమ్ ఛేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నిరు..మంగళవారం, పౌరవిమానయాన శాఖ,, DFI,,CII భాగస్వామ్యంతో మంగళగిరిలోని C.K కన్వెన్షన్ లో రెండ్రోజులపాటు అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 సదస్సును చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ యువత సాంకేతిక నిపుణులతో సదస్సు నిండిపోయిందని,, ఈ సమ్మిట్ లో 6,929 మంది ప్రతినిధులు పాల్గొన్నడం అభినందనీయం అన్నారు..తాను 1995లో తొలిసారి సీఎం అయ్యాక ITపై దృష్టిసారించి,, హైదరాబాద్ లో IT రంగం అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు.. ఆ రోజుల్లో అమెరికాకు వెళ్లి 15ను రోజులు అనేక సంస్థలను కలిశాను అని అన్నారు..PPP పద్దతిలో హైటెక్ సిటీని నిర్మించడం జరిగింన్నారు..ఐటీ, నాలెడ్జ్ ఎకనామీలో భారతీయులు చాలా సమర్ధులని సీఎం చంద్రబాబు అన్నారు..
ఇటీవల విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో డ్రోన్లు వినియోగించామన్నారు.. రెస్క్యూ టీమ్స్ వెళ్లలేని చోటుకు డ్రోన్ సేవలను ఉపయోగించుకుని బాధితులకు ఆహారం, మందులు పంపించామని తెలిపారు.. డ్రోన్లను వ్యవసాయం రంగంతో పాటు అనేక రంగాల్లో వినియోగించవచ్చు అన్నారు..ఔత్సహికుల్లో కొత్త ఆలోచనలు వస్తే ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చునని చంద్రబాబు అన్నారు.. కేంద్రం ప్రభుత్వం డ్రోన్ నిబంధనలను సులభతరం చేసిందని,,డ్రోన్ టెక్నాలజీ ఫ్యూచర్ గేమ్ ఛేంజర్ కాబోతుందని చంద్రబాబు పేర్కొన్నారు.. డ్రోన్ల వినియోగంతో రౌడీషీటర్ల కదలికలపై నిఘాతోపటు శాంతిభద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు డ్రోన్ లను వినియోగించొచ్చునని, పోలీసు శాఖలో డ్రోన్ల విస్తృత వినియోగానికి కృషి చేస్తామని చంద్రబాబు చెప్పారు.