ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా వద్ద రూ.4,200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా-డేనియల్ హగారీ
అమరావతి: బీరుట్ లోని ఓ ఆస్పత్రి కింద ఉన్న రహస్య సొరంగంలో మిలిటెంట్ గ్రూప్‌నకు సంబంధించి భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఐడీఎఫ్ సంచలన ప్రకటన విడుదల చేసింది..అల్-సాహెల్ ఆస్పత్రి కింద ఉన్న ఆ రహస్య బంకర్‌లో 500 బిలియన్ డాలర్ల నగదు(రూ.4,200 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా వేస్తున్నాం అని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ పేర్కొన్నారు..హమాస్ అధినేత యాహ్వా సిన్వర్‌ను హతమార్చిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగుతామని లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఇటీవల హెచ్చరించింది..దింతొ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్,, హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపేందుకు సిద్దం అయింది..
హెజ్‌బొల్లా ఆర్థిక వనరులపై వరుసగా దాడులకు చేస్తున్నమన్నారు.. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో ఓ రహస్య బంకర్‌ను ధ్వంసం చేస్తున్న సమయంలో భారీగా బంగారం, వేల డాలర్ల నగదును గుర్తించామన్నారు..ఇజ్రాయెల్‌పై దాడులకు ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా ఈ నగదునే వినియోగిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు..ఈ మిలిటెంట్ గ్రూప్‌నకు బీరుట్ నడిబొడ్డున మరో రహస్య బంకర్ ఉందని తెలిపారు.. అల్-సాహెల్ ఆస్పత్రి కింద ఉన్న ఆ రహస్య బంకర్‌లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం గుట్టలు ఉన్నట్లు తెలిసిందని,,అయితే ఆ బంకర్‌పై ఇంకా తాము దాడులకు దిగలేదని పేర్కొన్నారు.. ఆ బంకర్‌లో (500 బిలియన్ డాలర్లు) రూ. 4,200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నాం అని హగారీ పేర్కొన్నారు..బంకర్ ఉన్న ప్రాంతంలోని ఆస్పత్రిపై దాడులకు దిగడం లేదని,, తమ యుద్ధం కేవలం హెజ్‌బొల్లాతో మాత్రమే అని హగారీ స్పష్టం చేశారు.. లెబనీస్ పౌరులకు ఎలాంటి హానీ కలిగించమని వెల్లడించారు.. ఐడీఎఫ్ హెచ్చరికలతో లెబనీస్ అధికారులు ఆస్పత్రిని ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం.
https://x.com/i/status/1848436265143677104