మనస్పర్ధలు వస్తే, భర్తకు విషం పెట్టి చంపేస్తున్న భార్యలు!
అమరావతి: పది కాలాల పాటు తన మాంగల్యం పాదిలంగా వుండాలంటూ వత్రాలు,,నోముటు నొచే మహిళలు కనుమరుగు అవుతున్న రోజులు మన సమాజంలో చోటు చేసుకుంటున్నాయి..భార్య,భర్తల మధ్య నమ్మకం,,వైవాహిక బంధం క్షీణించి పోతున్నాయి అనేందుకు ప్రతి రోజు దేశంలో ఎదోక ఒక చోటు చేసుకుంటున్న సంఘటనలు చూస్తుంటే ఆర్ధం అవుతొంది….ఇందుకు మరో ఉదాహరణ…..తన భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని ఓ మహిళ రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం దీక్ష ముగియగానే భర్తకు విషమిచ్చి మట్టుపెట్టింది.. ఉత్తరాది మహిళలు జరుపుకునే కర్వా చౌత్ నోము నాడే వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది..
ఉత్తరప్రదేశ్‌లో కౌశాంబి జిల్లాలోని కడాధామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాది..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శైలేష్(32) అనే వ్యక్తిని అతడి భార్య సవిత కర్వా చౌత్ రోజునే విషం పెట్టి చంపేసింది..సదరు మహిళ ఆదివారం భర్త కోసం ఉపవాస దీక్ష చేపట్టింది..పూజకు కావాల్సినవన్ని సమకూర్చాడు.. సాయంత్రం సవిత యథాప్రకారం ఉపవాస దీక్ష ముగించింది.. ఆ తరువాత భార్యాభర్తల మధ్య వాగ్వాదం మొదలైంది.. గొడవ త్వరగానే సద్దుమణగడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం ముగించారు.. అంతకుముందే ఆమె విషం కలిపిన భోజనం భర్తకు పెట్టి,తను జాగ్రత్తగా భోజనం చేసింది..భోజనం తరవాత పొరిగింటి వారిని కలిసి వస్తానని చెప్పి అటునుంచి అటే పరారీ అయింది..ఆ తరువాత కొద్ది సేపటికే శైలేష్ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు..దురదృష్టవశాత్తూ అతడు చికిత్స పొందుతూ మృరణించాడు.. చనిపోయే ముందు శైలేష్ తన మరణవాంగ్మూలాన్ని వీడియోలో రికార్డు చేసుకున్నాడు..తన భార్యే తనకు విషయం పెట్టిందని అందులో పేర్కొన్నాడు.. శైలేష్ ఆకస్మిక మరణంతో షాకైపోయిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.