డయేరియా వల్ల మరణించిన గ్రామస్తులకు 10లక్షలు వ్యక్తి గతంగా సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్
అమరావతి: గుర్ల ఘటన తనను తీవ్రంగా బాధించిందని,, ఒక్కొక్క మృతుని కుటుంబానికి తాను వ్యక్తిగతంగా రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రకటించారు..విజయనగరం జిల్లాలోని గుర్లలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఆయన పరామర్శించిన సందర్బంలో డయేరియా వల్ల 10 మంది మరణించారని గ్రామస్తులు తెలిపారు..అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, డయేరియా కారణంగా ఎంతమంది చనిపోయారనే విషయం ప్రభుత్వ పరిశీలనలో తేలుతుందన్నారు.. గుర్లలో పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనిపించిందని,,ఈ గ్రామంలో దాదాపు బహిరంగ మలవిసర్జన జరుగుతుందని,, గ్రామస్తులు బహిరంగ మల విసర్జన ఆపకుంటే, మరిన్ని గ్రామాల్లో ఇదే తరహా ఘటనలు పునరావృతమయ్యే అవకాశముందని ఉప ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.. జిల్లా కలెకర్ట్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించనున్నారు.