వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి
అమరావతి: వైసీపీకి ప్రకాశం జిల్లాలో పెద్ద దిక్కుగా వ్యవహరించిన మాజీ మంత్రి,మాజీ సీ.ఎం జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు..తనకు ప్రాధాన్యత ఇవ్వని పార్టీలో కొనసాగలేనంటూ వైసీపీ అధినేత జగన్ తో జరిగిన సమావేశంలో నేరుగా కుండబద్దలు కొట్టిన బాలినేని,,తాను అనుకున్నది చేశారు..ర్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి ముందు చూపుతోనే ఒంగోలును వీడి హైదరాబాద్‌కు మకాం మార్చారు..తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నర్ధకం మారుతున్న సమయంలోనే వైసీపీకి పార్టీకి రాజీనామా చేసేశారు..రాజకీయంగా తాను మళ్లీ ఎదగాలంటే,రాబొయే రోజుల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకునే పార్టీలో కొనసాగే దిశగా అడుగులు వేస్తున్నారు.. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం సమావేశం కానున్నట్లు తెలుస్తొంది..సమావేశం అనంతరం జనసేన పార్టీలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది..అయితే మరో ప్రచారం కూడా సాగుతొంది..జాతీయస్థాయి పార్టీలో చేరే అవకాశం వుందన్న వార్తలు వస్తున్నాయి? మరి బాలినేని అడుగులు బీజెపీనా లేక జనసేనా ? వేచిచూడాలి..