రాష్ట్రంలో అవసరాల మేరకు నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటు-మంత్రి సత్యకుమార్
అమరావతి: రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటు నేపథ్యంలో ప్రతి సంవత్సరం వేలాది నర్సింగ్ సీట్లు మిగిలిపోతున్నందున పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్ర అవసరాల దృష్ట్యా నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల మేరకు వచ్చే ప్రతిపాదనల్ని మాత్రమే పరిశీలిస్తామని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారంనాడు వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో నర్సింగ్ విద్యకు సంబంధించిన పలు అంశాల సమీక్షా సమావేశంలో విస్తృత చర్చ అనంతరం మంత్రి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 691 నర్సింగ్ విద్యా సంస్థలు నడుస్తున్నాయని, వీటి ద్వారా ప్రతి ఏడాదీ దాదాపు 32,000 మంది నర్సులు పట్టబద్రులవుతున్నారని, దరిమిలా గత కొన్నేళ్లుగా సుమారు 6,000 నర్సింగ్ సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయని సమీక్షలో అధికారులు మంత్రికి వివరించారు.
గిరిజన ప్రాంతాలకు సంబంధించి:- 2014 నుంచి నేటి వరకు 243 నర్సింగ్ కాలేజీలు, స్కూళ్లు మంజూరు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇవన్నీ వివిధ సంస్థల స్వీయ ప్రతిపాదనల మేరకు (సుమోటో) వివిధ ప్రభుత్వాలు మంజూరు చేశాయి. ఇందుకు భిన్నంగా మొదటిసారిగా కూటమి ప్రభుత్వం గత ఏడాది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటుకు ఔత్సాహిక సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రకటనకు స్పందించి వచ్చిన దాదాపు 345 దరఖాస్తులు హైపవర్ కమిటీ పరిశీలనలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని మంత్రి తెలిపారు.ఉప్నాక దుర్గాప్రసాదరావు, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, డిఎంఇ డాక్టర్ రఘునందన్, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ సుశీల, ఇతర పలువురు ఉన్నతాధికారులు, నర్సింగ్ కాలేజీల మేనేజ్మెంట్ ఆసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

