గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసిన ఏపీపీఎస్సీ
అమరావతి: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను మంగళవారం APPSC వెబ్‌సైట్‌లో ఫలితాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది..1-2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు APPSC ఎంపిక చేసింది..ఈ పరీక్షలు మే 3 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు..పరీక్షలు జరిగిన నెలరోజుల్లోనే ఈ ఫలితాలను విడుదల చేసింది.. మెయిన్స్ పరీక్షలకు దాదాపు 4 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు..జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు..81 గ్రూప్-1 పోస్టులకు సంబంధించి మార్చి17-2024న ప్రిలిమ్స్ నిర్వహించారు.