AP&TGCRIME

మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం-8 మంది మృతి

అమరావతి: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలదొన గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం వేకువజాయున 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో బోలేరో గూడ్స్ వాహనం- ట్యాంకర్ ను ఢీకొనడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. బొలెరో వాహన డ్రైవర్ నిద్రమాత్తులో ఉండి వాహనం డివైడర్ దాటి అవతలి రోడ్డుపై వెళ్లి మరో వాహనాన్ని ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. ప్రమాద సమయంలో బోలేరో గూడ్స్ వాహనంలో 16 మంది ప్రయాణిస్తన్నారు.ప్రమాదంలో ఆరుమంది భక్తులు మృతి చెందగా మరో 13 మంది గాయపడినట్లు సమాచారం. మరణించిన వారిలో ఇందులో 4 గురు మహిళలు, 3 సంవత్సరాల బాలిక, డ్రైవర్,మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు కర్నాటక రాష్ట్రం చిక్ బాలాపూర్ జిల్లా తరికిరీ తాలుక ఉదయ్ గ్రామ వాసులుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది సకాలంలో సంఘటన స్థలంకు చేరుకుని,క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యం అందించి, ఎమ్మిగనూరు అంబులెన్స్, ముగ్గురిని గొనేగండ్ల అంబులెన్స్, మరో ముగ్గురిని నందవరం అంబులెన్స్ ద్వారా త్వరితగతిన CHC ఎమ్మిగనూరుకు తరలించి వైద్య చికిత్స అందించారు. మంత్రాలయం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతుల వివరాలు: మృతులు కర్ణాటకలోని చిక్‌మంగళూరు కనయాకనహళ్లి వాసులు కుమార్ (60), దీపిక వీణ (35), సునీల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), తాయమ్మ (60), లోలాక్షిగా గుర్తించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *