AP&TG

ఎండీయూ వాహనాలను రద్దు చేసి,రేషన్ దుకాణాల ద్వారా సరుకులు ఇచ్చే ప్రతిపాదనకు..

మంత్రివర్గం సమావేశం..

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం మంత్రివర్గం సమావేశం జరిగింది..ఈ సమావేశంలో పలు  నిర్ణయాలు తీసుకున్నారు..నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి 615 ఎకరాల భూ కేటాయింపు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది..ముఖ్యంగా రాష్ట్రంలోని రైతులకు సంబంధించి మిర్చి,,పొగాకు,,మామిడి,, కోకో,, చెరుకు,, ఆక్వా వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలను అధికారులు సీ.ఎంకు వివరించారు..రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

మంత్రి వర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు:- రాష్ట్రంలోని విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీసెంటర్ల ఏర్పాటుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకీ అనుమతి… ఎండీయూ వాహనాలను రద్దు చేసి,,రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ లో చర్చ…అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం…హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంకు తరలించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం…కడప జిల్లాలోని కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు అదానీ పవర్ కు భూ కేటాయింపు… ఎకరాకు రూ.5 లక్షల చొప్పున భూ కేటాయింపునకు కేబినెట్ నిర్ణయం…2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామక నిర్ణయానికి ర్యాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం… భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీసైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించేలా జీఓఎం చేసిన సిఫార్సుకు కేబినెట్ అమోదం…ఏపీ లెదర్ ఫుట్ వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం… పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు సంబంధించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం…రూ.30 వేల కోట్ల వరకూ పెట్టుబడులు,,35 వేల ఉద్యోగాల కల్పనకు మంత్రి వర్గం అమెదం తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *