అసలీ ధాబా, మిస్టర్ చిట్టి ముత్యాలు బిర్యానీ హోటళ్లల్లో కుళ్లిన చికెన్
హోటల్స్ తనఖీలు చేసి,కుళ్లిన మాంసం పట్టుకున్న సందర్బంలో హాటల్ లేదా డాబా నిర్వహకులపైన గతంలో పనిచేసిన అధికారులు అక్కడిక్కడే రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు ఫైన్ విధించే వారు. దింతో సదరు హోటల్ లేదా డాబా నిర్వహకుల్లో కొంచెం భయం అయిన వుండేది. నేడు మీ అరోగ్యశాఖాధికారి నోటీసులు ఇస్తే దిని వల్ల ఎలాంటి ప్రయోజనం వుంటుంది. ఈ తంతు చూసిన నగర ప్రజలకు నగరపాలక సంస్థ అధికారులపై ఎలాంటి గౌరవం వస్తుంది? కొంచెం అలోచించండి.? విషయంలోకి వస్తే…
నెల్లూరు: నగరంలోని మీని బైపాస్ రోడ్డులో వున్న రాంజీ నగర్ ప్రాంతంలోని నెల్లూరు అసలీ ధాబా, మిస్టర్ చిట్టి ముత్యాలు బిర్యానీ హోటళ్ల పై సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దినేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తనిఖీలలో నిల్వ ఉంచిన 5 కేజీల చికెన్, మటన్ లను గుర్తించి ఫినాయిల్ తో వాటిని నిర్వీర్యం చేశారు. నెల్లూరు నగర పాలక సంస్థ నిర్దేశించిన ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఆయా హోటళ్లకు నోటీసులను ఆరోగ్య శాఖాధికారి జారీ చేశారు. ఈ తనిఖీలలో నెల్లూరు నగరపాలక సంస్థ శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

