ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య ఎక్స్ ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఆరు గంటల నుంచి కేవలం రెండున్నర గంటల్లోనే….
100 అండర్‌పాస్‌లు, 5 రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌లు…
అమరావతి: ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య ఎక్స్ ప్రెస్‌వేను మంగళవారం ప్రధాని మోదీ ప్రారంభించారు.దాదాపు 11,868 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 212 కిలోమీటర్ల మేర ఎక్స్ ప్రెస్ వే నిర్మించారు.ఈ ఎక్స్ ప్రెస్‌వేను, ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌గా కూడా పిలుస్తున్నారు. యూపీలోని షమరాన్పూర్ అటవీ ప్రాంతంలో ఎక్స్ ప్రెస్‌వే కోసం బ్రిడ్జ్‌లను నిర్మించారు. డెహ్రాడూన్ సమీపంలో ఉన్న జై మా దాత్ కాళి ఆలయంలో మోదీ పూజలు చేశారు. దేశరాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ వరకు ఈ ఎక్స్ ప్రెస్ వేతో ప్రయాణ సమయం 6 గంటలు పట్టే సమయాన్ని ఇప్పుడు కేవలం 2.30 గంటల్లోనే డెహ్రాడూన్ చేరుకుంటారు. ఛార్థామ్ యాత్రికులకు ఇది కీలక రోడ్డుమార్గం కానున్నది.
100 అండర్‌పాస్‌లు:- 2021లో ఈ ప్రాజెక్టును నితని గడ్కరీ దీనికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ఆ ఏడాది డిసెంబర్‌లోనూ మరో శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2024 డిసెంబర్ నాటికి ఎక్స్ ప్రెస్‌వే పూర్తికావాల్సి వుంది.అయితే ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో భాగంగా 100 అండర్‌పాస్‌లు, 5 రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌లు ఉన్నాయి. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్‌వే, ఈస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్ ఫ్రెస్వేలకు కూడా ఇది కనెక్ట్ అవుతుంది. హరిద్వార్, రూర్కీ వెళ్లే మార్గాలకు కూడా కొత్త హైవే కలుస్తుంది.
వన్యప్రాణుల రక్షణకు ఎక్కువ ప్రాధాన్యం:- ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ సమయంలో వన్యప్రాణుల రక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. జంతువుల రక్షణ నేపథ్యంలో రాజాజీ నేషనల్ పార్క్ లో సుమారు 12 కిలోమీటర్ల ఎలివేట్ వైల్డ్‌లైఫ్ కారిడార్‌ను నిర్మించారు. దీంట్లో 6 జంతువుల అండర్‌పాస్‌లు, 8 జంతు పాస్‌లు, 200 మీటర్ల పొడువైన రెండు ఏనుగు మార్గాలతో పాటు దాత్ కాళీ ఆలయం సమీపంలో 370 మీటర్ల టన్నెల్‌ను నిర్మించారు.4 దశల్లో ఎక్స్ ప్రెస్‌వే నిర్మాణం సాగింది.

