రేషన్ బియ్యం అక్రమాల్లో పేర్ని.నాని సతీమణి జయసుధపై కేసు నమోదు
అమరావతి: రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే రేషన్ బియ్యం అక్రమాలు రోజుకు ఒకటి చొప్పున బయట పడుతున్నాయి.. ఆక్రమల్లో బాగంగా కృష్ణాజిల్లా బందరులో కోటి రూపాయల రేషన్ బియ్యం స్వాహా చేసినట్లు తేలింది..ఈ విషయంలో వైసీపీ మాజీ వైసీపీ మంత్రి,,టీడీపీ,జనసేన అధ్యక్షలపై నోటికి వచ్చినట్లు మాట్లాడిన పేర్ని నాని చిక్కుల్లో పడ్డారు..రేషన్ బియ్యం స్వాహా విషయంలో పేర్నినాని సతీమణి జయసుధ,,నాని వ్యక్తిగత కార్యదర్శిపై కేసు నమోదైంది..వైసీపీ ప్రభుత్వ హాయంలో నాని సతీమణి పేరిట గోడౌన్ నిర్మించి, సివిల్ సప్లయిస్‌కు అద్దెకు ఇచ్చారు..పేదలకు అందిచాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిందని తెలుస్తోంది..దీంతో పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. పది రోజుల క్రిందట సివిల్ సప్లయ్స్ అధికారులు నిర్వహించిన వార్షిక తనిఖీల స్టాక్‌లో అధికారులు భారీగా బియ్యం వ్యత్యాసాన్ని గుర్తించారు..దాదాపు 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు అధికారులు వెల్లడించారు..భారీ ఆక్రమాలపై పౌరసరఫరాలశాఖ అధికారి కోటిరెడ్డి,,మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు..అయన ఫిర్యాదు మేరకు 316(3), 316(5), 61(2) రెడ్ విత్ 3(5) BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు..