రాష్ట్రంలో విడుదలైన 10వ తరగతి పరీక్షల షెడ్యూల్
అమరావతి: రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది..2025, మార్చి 17వ తేది నుంచి 31వ తేది వరకూ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు..విద్యార్థులపై ఒత్తిడి తగ్గేలా రోజు విడిచి రోజు పరీక్షలు ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసినట్టు మంత్రి తెలిపారు..ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు..
17వ తేదీన మొదటి లాంగ్వేజ్ పరీక్ష,,19వ తేదీన రెండో లాంగ్వేజి,,21వ తేదీన ఇంగ్లీష్,,24వ తేదీన గణితం,, 26వ తేదీన భౌతిక శాస్త్రం,,28వ తేదీన బయాలజీ,,29వ తేదీన ఓకేషనల్,,31 తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలు వుంటాయన్నారు.