వైసీపీకి దెబ్బ మీద దెబ్బ-మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
అమరావతి: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతొంది..సదరు పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు..ఈ విషయంపై గురువారం ఏర్పాటు విశాఖపట్నంలో చేసిన మీడియా సమావేశంలో ఆయన అధికారికంగా ప్రకటించారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధిష్టానం నిర్ణయాలపై ఆసహనం వ్యక్తం చేశారు..భీమిలి నియోజకవర్గంలో నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేశానని చెప్పారు.. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజా తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉందని,,ఎవరు మీద నెపం నెట్టాల్సిన అవసరం లేదన్నారు..వైసీపీ పాలనలో ప్రజలకు అనేక పథకాలు అందచేసి,, అభివృద్ధి చేసినప్పటికీ ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. స్థానిక నాయకులపైనే కాకుండా అధిష్టానంలో ఉన్న వారిని చూసి నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారు..”నా హయాంలో నేనెలాంటి అవినీతి చెయ్యలేదు.. అవినీతిని ప్రోత్సహించలేదు”.. ఏ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి,, కనీసం 6 నెలల కాక ముందే ఆందోళనలు, నిరసనలు, అంటే కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారన్నారు.. వైసీపీ హయాంలో కార్యకర్తలు, నేతలు పలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు..ఆ సమయంలో అంతా వాలంటీర్‌లే నడిపించారని చెప్పారు.. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఇప్పుడు నేతలందరిని ఒకేసారి రోడ్డు ఎక్కండి అంటే ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు.. తాను ఏ పార్టీలో చేరతారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు… కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు.