ప్రతి రెండు నెలలకూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తా-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
మన్యం రోడ్లకు శంకుస్థాపనలు..
అమరావతి: ఎన్నికల ప్రచార సమయంలో గిరిజన గ్రామాల అభివృద్ధికి తాను ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తును అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు..శుక్రవారం పార్వతీపురం మన్యం మక్కువ మండలం బాగుజోల-సిరివర గ్రామాల మధ్య 9 కి.మీ.రోడ్డు నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ గడచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ ప్రాంతాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని,,రూ.500 కోట్లు పెట్టి రుషికొండ ప్యాలస్ కట్టారుకానీ రూ.9 కోట్లతో ఈ రోడ్డు నిర్మించలేకపోయారని విమర్శించారు.. ఉత్తరాంధ్రను తాకట్టు పెట్టి తెచ్చిన వేలాది కోట్ల రూపాయలు ఏం చేశారో తెలియదని,,మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సుమారు 25 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియదన్నారు..2017లో జనసేన పోరాటయాత్రలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గిరిజనుల కష్టాలు తాను స్వయంగా చూశానని తెలిపారు..
“ఇక్కడికి నేను కేవలం రోడ్ల కోసమే రాలేదు..మీ కష్టాలు బాధలు తెలియాలి.. యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలి అనేవి తెలుసుకోవాలన్నారు..నేను 5 సంవత్సరాల తరువాత వచ్చే ఎన్నికల కోసం చెప్పడం లేదు,,వచ్చే సంవత్సరం లోపు మీకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటదా అని ఆలోచిస్తున్నాను” అని అన్నారు..
గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తానని పవన్ చెప్పారు. పర్యాటక అభివృద్ధి చేసి, ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రతి రెండు నెలలకూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు.
మన్యం పార్వతీపురం జిల్లాల్లో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,,19 నూతన రోడ్లకు శంకుస్థాపనలు దాదాపు 36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ మేర నూతన రోడ్ల నిర్మాణ,రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డొలీల బాధల నుండి విముక్తి..మన్యం పార్వతీపురం జిల్లా, సాలూరు నియోజకవర్గం, బాగుజోలలో శంఖుస్థాపన కార్యక్రమాలు చేయనున్నారు.