శ్రీ సిటీలో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన మహిళలకు ఉద్యోగ అవకాశలు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో SS ఇన్స్ట్రుమెంట్స్ శ్రీ సిటీలో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన మహిళలకు నెలకు Rs.17,600 జీతం,,ఇతర సదుపాయాలతో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి,లోకనాధం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ స్పోక్స్ లో భాగంగా ఇండస్ట్రీ కష్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్(ICSTP) మల్టి నేషనల్ కంపెనీ శ్రీ సిటీలో నందు ఉన్న SS ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్,ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ లో డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ 2021 నుంచి 2024 మధ్యలో పూర్తి చేసి 19 నుండి 26 సంవత్సరాలు ఉన్న మహిళలలకు మాత్రమే అసోసియేట్ గా ఉద్యోగంతో పాటు ఒక నెల భోజన వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారన్నారు..అంతే కాకుండా యూనిఫాం,క్యాంటీన్, 20 కిలోమీటర్ల పరిధిలో రవాణా సౌకర్యం కూడా ఉచితంగా కల్పిస్తారని పేర్కొన్నారు..ఆసక్తి కలిగిన ఉన్న మహిళా అభ్యర్థులు 23-12-2024వ తేదీ లోపల https://naipunyam.ap.gov.in/user-registration నందు వారి వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.. లేదా శ్రీ సిటీ నందు APSSDC-ICSTP సెంటర్ నందు ఇంటర్వ్యూస్ కొరకు హాజరు కావచ్చాన్నారు..ఇతర వివరాలకు 9154449677, 9908243736 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.