జైపూర్‌లోని అజ్మీర్ హైవేపై ఘోర రోడ్డ ప్రమాదం-ఐదుగురు మృతి
23 మందికి గాయాలు..
అమరావతి: రాజస్థాన్‌లోని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్ పెట్రోల్ పంపు సమీపంలో శుక్రవారం వేకువజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది..రద్దీగా ఉండే అజ్మీర్ హైవేలో LPG,,CNG ట్యాంకర్లు ఢీకొన్నాయి..దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని స్థానికులు వెల్లడించారు..ట్యాంకర్లు ఓవర్ టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో,,మంటలతో వున్న ట్యాంకర్లు రోడ్డుపై వెళ్లుతున్న పలు వాహనలపైకి దూసుకుని వెళ్లాయి..ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు..స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు,అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు..ప్రమాదం జరిగిన ప్రదేశంకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది,,మంటలు అంటూకున్న ట్యాంకర్లను కూలింగ్ ఫోమ్,,నీటితో మంటలను అదుపులోకి తెచ్చారు..జైపూర్-అజ్మీర్ హైవే ప్రమాదంలో 23 నుంచి 24 మందికి తీవ్ర కాలిన గాయాలైనట్లు సమాచారం.. వారిని చికిత్స నిమిత్తం సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రికి తరలించారు.. దాదాపు 40 వాహనాలకు మంటలు అంటుకున్నాయని జైపూర్ డీఎం జితేంద్ర సోనీ తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి వుంది?