ఫార్ములా E-Car రేస్ స్కామ్‌లో కేసు మాజీ మంత్రి KTRపై కేసు నమోదు చేసిన ACB
హైదరాబాద్: ఫార్ములా E-Car రేస్ స్కామ్‌లో కేసు ACB A-1గా మాజీ మంత్రి KTRపై కేసు నమోదు చేసింది..KTRతో పాటు A-2గా IAS అరవింద్ కుమార్ A-3గా HMDA మాజీ చీఫ్ ఇంజినీర్, ప్రైవేట్ కంపెనీ CEO BLNరెడ్డిలు నిందితులుగా పేర్కొన్నారు.. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగంపై 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120 B కింద ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది..RBI గైడ్‌లైన్స్ కు విరుద్ధంగా ఎఫ్‌ఈవో కంపెనీకి హెచ్ఎండీఏ రూ.45 కోట్లు చెల్లించింది.. క్యాబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే,, నిధులు చెల్లించినట్టు కేటీఆర్‌పై అభియోగాలున్నాయి..కేటీఆర్ ఆదేశాలతోనే IAS అరవింద్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి..ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతి లేకుండా చెల్లించడంపై అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి RBI రూ.8 కోట్ల ఫైన్ వేసింది.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక RBIకి రూ.8 కోట్లు తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది..