ఉచిత ఇసుక పాలసీపై ఫీజు రద్దు చేస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి: ఉచిత ఇసుక పాలసీ 2024లో సినరేజీ ఫీజు మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మైన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జీవో జారీ చేశారు.. ఉచిత ఇసుక పాలసీపై ఈ నెల 21వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయలను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..ఎటువంటి రుసుం చెల్లించకుండా ఇసుకను నిర్మాణ అవసరాలకు తీసుకు వెళ్లేలా ఆదేశాలు జారీ చేసింది.. నిర్మాణ రంగంతో ఉపాధి ఆదాయం పెరుగుతున్నందున ఉచిత ఇసుక పూర్తిస్థాయిలో అమలుకు చర్యలు తీసుకుంది.