అమరావతి కి సంబంధించి న్యాయపరమైన అంశాలు ఒకొక్కటిగా పూర్తి చేస్తున్నాం-మంత్రి నారాయణ
అమరావతి: అమరావతి రాజధాని రైల్వే ప్రాజెక్ట్ కు కేంద్రం ఆమోదం తెలపడం శుభపరిణామని పురపాలక,పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.గురువారం అయన మీడియాతో మాట్లాడారు..2017 నవంబరు 13న ఈ ప్రాజెక్టు కేంద్రానికి ఇచ్చామని అయితే వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాజెక్ట్ ను పక్కన పడేసిందని మండిపడ్డారు.. ప్రతీ రాష్ట్ర అభివృద్ధి కి వనరులు,మౌళికవసతులు ఎంతో అవసరం అని అన్నారు.. ఎర్రుబాలెం నుంచి నంబూరు వరకూ అమరావతి మీదుగా 57 కిలోమీటర్ల మేర లైన్ 2245 కోట్లతో నిర్మాణం కానుంది..ఈ రైల్వే లైన్ వల్ల మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కనెక్టివిటీ అవుతుంది..4 ఏళ్ళలో దీనిని పూర్తి చేస్తామని రైల్వేశాఖ తెలుపిందని అయితే సీఎం చంద్రబాబు మూడేళ్ళలో పూర్తి చేయాలని అడిగారున్నారు..అమరావతి కి సంబంధించి న్యాయపరమైన అంశాలు ఒకొక్కటిగా పూర్తి చేస్తున్నాన్నమన్నారు..జగన్ వల్ల అమరావతి రైతులు పడినన్ని కష్టాలు ఇంకెవరూ పడలేదని,,అందుకే రైతుల సమస్యలపైనే ముందుగా దృష్టి సారించామని చెప్పారు..గత కాంట్రాక్టులు అన్నీ మరో పదిహేను రోజుల్లో రద్దు చేసి కొత్తవాటిని పిలుస్తామని,,నవంబర్ మొదటి వారం నుంచి డిసెంబర్ చివరిలోగా అన్ని పనులకూ టెండర్లు పూర్తి చేస్తామని వెల్లడించారు..360 కిమీ ట్రంక్ రోడ్లు,లేఅవుట్లు,3600 ఫ్లాట్లకు,కొండవీటి,పాలవాగు,గ్రావిటీ కెనాల్,కరకట్ట రోడ్డుకు టెండర్లు,,అసెంబ్లీ,హైకోర్టు నిర్మాణానికి జనవరి నెలాఖరుకు టెండర్లు,,సెక్రటేరియట్ భవనాల నిర్మాణానికి డిసెంబర్ నెలాఖరులో టెండర్లు పూర్తి చేస్తామని తెలిపారు.