రాజధాని అమరావతికి కొత్త రైల్వే అనుసంధాన ప్రాజక్ట్- రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్
అమరావతి: రాజధాని అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజక్టుకు గురువారం కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ప్రధాని నరేంద్ర మోదీ,,ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం,రాష్ట్రానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు..ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి, బీహార్‌కు రెండు కీలక రైల్వే ప్రాజెక్టులు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు..మొత్తం రూ.6,789 కోట్ల వ్యయంతో ఈ రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని చెప్పారు..
మొత్తం రూ.2,245 కోట్ల వ్యయంతో 57 కిలోమీటర్ల మేర అమరావతి కొత్త రైల్వే లైన్‌ను నిర్మించనున్నారు.. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాకు నేరుగా అనుసంధానం చేస్తూ ఈ ట్రాక్ నిర్మించనున్నారు.. ఈ లైన్ ద్వారా దక్షిణ భారతదేశాన్ని మధ్య,, ఉత్తరాదితో అనుసంధానం చేయడం మరింత సులువు అవుతుంది..అమరలింగేశ్వర స్వామి, అమరావతి స్థూపం, ధ్యానబుద్ద, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి అలాగే మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కూడా అనుసంధానిస్తూ నిర్మాణం చేపట్టనుండడంతో బహుళ ప్రయోజనాలు ఉంటాయి..కొత్తగా నిర్మించనున్న రైల్వే లైన్ ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు ఉంటుంది..కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జిని నిర్మించనున్నారు.. తెలంగాణలో ఖమం జిల్లా, ఏపీలో ఎన్‌టీఆర్ విజయవాడ, గుంటూరు జిల్లాలను కలుపుతూ ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణం జరగుతుంది.