ల్యాండ్ పూలింగ్ విధానంలో మరో 24 వేల ఎకరాలు-మంత్రి నారాయణ
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీ అథారిటీ 48వ సమావేశం జరిగింది.. అమరావతిలో జీఏడీ టవర్,మరో నాలుగు టవర్ల నిర్మాణానికి ఏజెన్సీలకు LOA ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది..మొత్తం 3673.44 కోట్లతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు..సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాభిప్రాయంతోనే భూ సమీకరణ నిర్ణయం తీసుకోవాలనుకున్నామని,,పెదకూరపాడు పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపామన్నారు..అంతర్జాతీయ క్రీడా నగరం కోసం 34 వేల ఎకరాల భూ సమీకరణ సరిపోదని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్,స్పోర్ట్స్ సిటీ,స్మార్ట్ ఇండస్ట్రీల కోసం కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు..ఇప్పటి వరకూ 24 వేల ఎకరాలు పూలింగ్ కు ఇచ్చేందుకు రైతుల ఆసక్తి చూపించారని,,గతంలో ఉన్న ల్యాండ్ పూలింగ్ నిబంధనలను కొత్త భూములకు వర్తింపచేసేందుకు అధారిటీ ఆమోదముద్ర వేసిందని వెల్లడించారు..అమరావతిలో స్థాపించే విద్య,వైద్య సంస్థలకు రిజిస్ట్రేషన్ ఫీజు లో సడలింపులు ఇస్తామని తెలిపారు..నిర్మాణాల ధరలు 22 మంది చీఫ్ ఇంజినీర్ల కమిటీ సూచనల మేరకే నిర్ణయించామని,,మాజీ సీఎం జగన్ గతంలో రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో ప్రకటించి ఇప్పుడు మాటమార్చారని మండిపడ్డారు..నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ మాజీ సీఎం జగన్,,రాష్ట్ర అభివృద్ది కోసం సలహాలు ఇస్తే స్వీకరిస్తామని అబద్దాలు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.. తమ తప్పేమీ లేకపోయినా గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందని సింగపూర్ అధికారులు చెబుతున్నారని మీడియాకు వెల్లడించారు.. అమరావతి అభివృద్ది కోసం ఇతర సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.