ప్రమాదలు జరిగితే, పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదు-పవన్ కళ్యాణ్
అమరావతి: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో చోటుచేసుకున్న ప్రమాద ఘటన తనను కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు..ఈ ఘటనపై మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ మాట్లాడుతూ “కాలుష్య నియంత్రణ నా పరిధిలో ఉంది, భద్రత వేరే శాఖలోకి వస్తుంది.. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలాసార్లు చెప్పాను.. ఇలాంటివి తరుచూ జరుగుతున్నాయని, ఆ కంపెనీకి చెందిన ఇద్దరు యజమానులకు విభేదాలు ఉన్నాయని, అందుకే నిర్వహణ సరిగ్గా లేదని తెలిపారు.. సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని,, సేఫ్టీ అడిట్ అంటే కంపెనీల యాజమానులు భయపడుతున్నారని, అలా భయపడితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు.. సేఫ్టీ అడిట్లు చేస్తే పరిశ్రమలు వెళ్లిపోతాయనే వదంతు ఉందని అయితే పరిశ్రమలు ఉండటం ఎంత ముఖ్యమో సేఫ్టీ కూడా అంతే ముఖ్యమని అన్నారు..విశాఖ పొల్యూషన్, పరిశ్రమల సేఫ్టీపై తాను చర్యలు తీసుకుంటానని,,త్వరలోనే విశాఖలో అధికారులు, పరిశ్రమల యజమానులలతో చర్చిస్తానన్నారు.. సేఫ్టీపై నిరంతర సమీక్ష లేకపోవడం వల్లే ప్రమాదాలు రిపీట్ అవుతున్నాయని చెప్పారు.. ప్రాణాలు పోకుండా కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, పర్యావరణ సమతుల్యత పాటించే విధంగా పరిశ్రమలు ఉండాలన్నారు..ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరం.. సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదు.. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ మెుదలు పెడతా” అని వెల్లడించారు.